సోయాబీన్ పత్తి పెసర పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

మద్నూర్ ఆగస్టు 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కోడిచిర గ్రామంలో సాగు చేస్తున్న సోయాబీన్,పెసర మరియు పత్తి పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు తెలియజేశారు.రైతులుసోయాబీన్ పంటలో :పచ్చ పురుగు మరియు కాండం తొలుచు ఈగ గమనించడం జరిగింది
నివారణకు :Emamectin Benzoate ఎకరానికి 100 గ్రాములు పిచికారీ చేయాలి.తీవ్ర స్థాయిలో పురుగు ఉధృతి ఉంటే Flubendiamide ఎకరానికి 100 గ్రాములు + 13:0:45 ఎకరానికి పిచికారి చేసుకోవాలి.పత్తి పంటలో ఆకు మచ్చ తెగులు కోసం Mancozeb + Carbendazim (Saaf) ఎకరానికి 400 గ్రాములు లేదా Propiconazole (Tilt) 200 మి.లీ. ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు.కంది పంటలోఎండు తెగులునియంత్రణకు Copper Oxychloride (COC) లీటరు నీటికి 3 గ్రాములు, అంటే ఎకరానికి 600 గ్రాములు + 13:0:45 ఎకరానికి 1 కిలో పిచికారీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈవో రాజహిత, రైతులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

News

WhatsAppEmailXTelegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *