రావి చెట్టుని ఇలా పూజించండి.. శనీశ్వరుడి అనుగ్రహం మీ సొంతం..

మన హిందూ మతంలో శని ప్రదోష ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శని ప్రదోష ఉపవాసం మహిమ గురించి శాస్త్రాలు, పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. ప్రదోష ఉపవాసం ప్రతి నెలా రెండుసార్లు వస్తుంది. హిందూ మతంలో ప్రదోష వ్రతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివుడు, పార్వతిని పూజించే సంప్రదాయం ఉంది.ఈ ప్రదోష వ్రతం శనివారం నాడు వస్తే.. దానిని శనివారం ప్రదోషం అంటారు. అందుకే ఈరోజుకి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలవంతమైనది. ఇక శనివారం వస్తే అది మరింత ముఖ్యమైనది అవుతుంది. శని ధైయ్య లేదా ఏలి నాటి శని ప్రభావంతో బాధపడేవారికి ఈ ఉపవాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

శని ప్రదోష ఉపవాస శుభ సమయం

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ఈ ఉపవాసం (మే 24న) చేయనున్నారు. వైశాఖ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి మే 24న సాయంత్రం 7:21 గంటలకు ప్రారంభమై ఈ తిథి 25న మధ్యాహ్నం 3:51 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిధి ప్రకారం ఈ రోజు ఉపవాసం ఉండనున్నారు.